BRS Leaders House Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్ వద్ద ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు.
Read also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!
నిన్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహారాకాస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహనిర్బంధం చేస్తున్నారు. కాగా.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్‌చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లి దండేమూడి ఎన్‌క్లేవ్‌లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
Read also: Heroine : ప్రభాస్, బన్నీ సరసన ఛాన్స్ వస్తే రిజెక్ట్ చూపే దమ్ము ఆ హీరోయిన్ కు ఉందా ?
కాగా, గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లారాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డికి నాంపల్లి కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేయగా, సాయంత్రం హరీష్ రావు, పల్లారాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తమపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Revenue Meetings: నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. అక్కడికక్కడే భూ సమస్యల పరిష్కారం..!