Patnam Narender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన బీఆర్‌ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు నరేందర్ రెడ్డికి లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా ? మాట్లాడిన వారు ఎవరు ? అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు.. అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారని, ప్రధాన నిందితుడు సురేష్ కావాలని కలెక్టర్ ను మాయమాటలు చెప్పి గ్రామం లోకి తీసుకొని వెళ్లారన్నారు. సురేష్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరున్న వదిలిపెట్టేది లేదని తెలిపారు. సురేష్ కాల్ డేటా అంతా తీస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. ప్రస్తుతం సురేష్ పరారీ లో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఐజీ తెలిపారు. సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Astrology: నవంబర్ 13, బుధవారం దినఫలాలు