Bonthu Rammohan: అరికెపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వార్తల్లో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డి ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎంఎల్ఏ గాంధీ స్పందించారని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న హైదరబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బి.ఆర్.ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బి.ఆర్.ఎస్ వాక్యాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
Read also: Hyderabad CP Anand: ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..
ఇక మరోవైపు ఇవాళ కాంగ్రెస్ మహిళా నేతలు, కార్పొరేషన్ ల చైర్ పర్సన్ లు స్పీకర్ ను కలిశారు. కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల కౌశిక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. మహిళలను కించపర్చిన కౌశిక్ రెడ్డి నీ ఎమ్మెల్యే గా డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలిసి కోరాం అన్నారు. ఆంధ్ర వాళ్ళ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కేసీఆర్ స్పందించాలని కోరారు. ఆ వ్యాఖ్యలు పార్టీ కి సంబంధం లేకుంటే కౌశిక్ రెడ్డి నీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read also: Harish Rao: భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు
అయితే ఇవాళ మియాపూర్ చౌరస్తాలో పలువురు ఆంధ్రా సెటిలర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. అరికెపూడి గాంధీకి మద్దతుగా ధర్నాకు పిలుపు నిచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పలువురు నిర్ణయించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనకు అనుమతి లేదని ధర్నా చేయొద్దని పోలీసులు తెలిపారు. పోలీసుల సూచనతో సెటిలర్లు ధర్నా కార్యక్రామన్ని విరమించుకున్నారు.
School Holidays: విద్యార్థులకు పండగే.. ఈనెల 14 నుంచి 17 వరకు స్కూల్స్ కి సెలవులు