NTV Telugu Site icon

Nalla Pochamma Bonalu: ప్రజాభవన్‌లో బోనాల సందడి.. నల్ల పోచమ్మ ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి

Prjabhavan Bonalu

Prjabhavan Bonalu

Nalla Pochamma Bonalu: ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిసున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్‌లో ఈరోజు నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి లు హాజరయ్యారు.

Read also: CM Revanth Reddy: నచ్చితే నచ్చిందని చెప్పండి లేకపోతే లేదు.. కాటమయ్య సేఫ్టీ కిట్లపై సీఎం ఆరా..

బోనాల ఉత్సవాల్లో భాగంగా.. ప్రజాభవన్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు భట్టి విక్రమార్క దంపతులు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ పండితులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్.పద్మావతి ఉత్తమ్‌ , తదితర మహిళ ప్రజా ప్రతినిధులు బోనం ఎత్తుకోగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై పెట్టారు. డిప్యూటీ సీఎం నివాసం నుంచి  ప్రజాభవన్ ఆవరణలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయం వరకు డబ్బు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు.

Read also: CM Revanth Reddy: కల్లులో నీళ్ళు ఏమైనా పొస్తున్నారా..? సీఎం రేవంత్ ఫన్నీ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..

ప్రజా భవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణి రెడ్డి, తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.‌ ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్,  శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్, వీర్లపల్లి శంకర్, శ్రీహరి, గణేష్, కాలే యాదయ్య, మక్కాన్ సింగ్ ఠాగూర్, ఎన్ ఉత్తమ్‌ పద్మావతి,  పర్ణిక రెడ్డి, మదన్మోహన్‌రావు,  రామ్మోహన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, విజయ రమణారావు,  మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు,  నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..