CM Revanth Reddy: రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని కాటమయ్య సేప్టీ కిట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఈత మొక్కలను నాటారు. అనంతరం తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును సీఎం పరిశీలించారు. తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును గౌడన్నలు వివరించారు. కిట్స్ పని తీరును గౌడన్నలను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తాటి వనంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాటమయ్య రక్షణ కవచంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కారు. లైవ్ లో రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని తెలిపారు. రక్షణ కవచంతో వల్ల సేఫ్ గా ఉన్నామని రంగయ్య అనే గీత కార్మికుడు సీఎంతో చెప్పాడు. ఎల్లో టీషర్ట్ వేసుకున్న గీత కార్మికుడిని టీ షర్ట్ భాగుందని సీఎం రేవంత్ రెడ్డి కితాబు ఇచ్చారు.
Read also: CM Revanth Reddy: కల్లులో నీళ్ళు ఏమైనా పొస్తున్నారా..? సీఎం రేవంత్ ఫన్నీ కామెంట్స్
రోజుకు 15 చెట్లు గీస్తామని సీఎంతో తెలిపారు. 15 చెట్లు గీస్తే 45 లీటర్ల కల్లు వస్తుందని చెప్పారు. 45 లీటర్ల కల్లులో, నీళ్ళు ఏమైనా పొస్తున్నారా అని రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడారు. ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మీకు ఏమైనా ఉందా? అడిగి తెలుసుకున్నారు. ఊర్లో బెల్ట్ షాపులు లేవని చెప్పి..మాకు ఉపాధి కల్పించమన్నారు. వాన కాలం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహేష్ గౌడ్ కు MLC ఇచ్చాం.. మధు యాష్కీ అన్న ఒక్కరే ఖాలీగా ఉన్నాడు.. ఆయనకు ఇస్తామన్నారు. వనం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రోడ్లు వేసినప్పుడు వాటి వెంబడి తాటి చెట్లు , ఈత చెట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. రియల్ ఎస్టేట్ వల్ల చెట్లు కొట్టేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలు భూమి కావాలని గీత కార్మికులు సీఎం చెప్పుకున్నారు.
Ratan Bhanadar : 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ దేవాలయం రత్న భాండాగారం