Bomb Threat: హైదరాబాద్ సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు ఇవాళ (జూన్ 19న) బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు స్కూల్ యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. హూటాహూటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ స్కూల్‌కు చేరుకుని క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. స్కూల్‌లోని విద్యార్థులు, సిబ్బందిని మొత్తం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 3 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు.
Read Also: Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..
అయితే, ఈ బెదిరింపు మెయిల్ కేవలం ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు తేల్చారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం విచారణ కొనసాగిస్తుంది. ఈ ఘటన స్కూల్ యాజమాన్యాన్ని, స్టూడెంట్స్ తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే, బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సమయంలో స్కూల్ లో 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఇక, పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పేర్కొనింది.
