Bomb Threat: హైదరాబాద్ సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు ఇవాళ (జూన్ 19న) బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు స్కూల్ యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. హూటాహూటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ స్కూల్‌కు చేరుకుని క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు.