Site icon NTV Telugu

Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజన్నారు. వేలాదిమంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారన్నారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహోసపెతమైందన్నారు.

Read also: Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం బాహుబలి సూపర్ క్రేన్..

లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శ్యోభా యాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు, నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
Balapur Ganesh Laddu: అందరి చూపు బాలాపూర్‌ లడ్డూ వేలం పైనే.. ఈసారి రూ.30 లక్షలు పైమాటే..?

Exit mobile version