NTV Telugu Site icon

BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

Jp Nadda

Jp Nadda

BJP Poru Sabha: నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహించనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు అనే నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీజేపీ సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు.

Read also: Astrology: డిసెంబర్ 07, శనివారం దినఫలాలు

కాగా.. శుక్రవారం సరూర్ నగర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఎంపీపీ ఈటల రాజేందర్, నాయకులు చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. సాయంత్రం 5.30కి బేగంపేట విమానాశ్రయానికి నడ్డా చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం 6.15 నుంచి 7.45 వరకు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభలో పాల్గొంటారు. రాత్రి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగివెళ్లనున్నారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగ సభలో బయటపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం.
Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు