Site icon NTV Telugu

Phone Tapping Case: రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్పై విచారణ

Bjp

Bjp

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.

Read Also: Brest Cancer: అలాంటి మార్పులు శరీరంలో కనిపిస్తున్నాయా..? అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సుమీ..!

అయితే, బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు ఆయన చేర వేసినట్లు తేలింది. దీంతో బీజేపీ నేతల నియోజక వర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు భుజంగరావు సమాచారం ఇచ్చే వారని సిట్ అధికారులు గుర్తించారు.

Read Also: Single-use Plastic Ban: అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం.. సర్కార్‌ ఆదేశాలు

మరోవైపు, రేపటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్ కు బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు తేలింది. ఆయన్ను సిట్ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. రెండు, మూడు రోజుల్లో సిట్ ముందుకు వెళ్లనున్న ప్రేమేందర్ రెడ్డి. ఆయనతో పాటు బీజేపీ ఆఫీస్ సిబ్బందిలో కొందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు సమాచారం.

Exit mobile version