BJP MP K Laxma: సోనియా గాంధీ తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా? కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడితే చేసేదేమీ లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటున్నాడు కేటీఆర్.. పదేళ్లు మూత పడ్డ కాలేజీలు తెరిచామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి మేము అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి ఐనా ఉన్నారా..? అని ప్రశ్నించారు.
Read also: Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?
దళిత బంధు ఎంత మందికి ఇచ్చారు? అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు లాక్కుంది కేసీఆర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో భూములు లాక్కుని.. కలెక్టర్ కార్యాలయం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర,హరీష్ పర్యటన ఉందంటే హౌస్ అరెస్టు చేసే వాళ్ళు అని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ నీ చిన్నాభిన్నం చేసింది మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే రెచ్చగొడతారు.. పోలీసులను తిడతారు.. మళ్ళీ రివర్స్ పోలీసులనే తిడతారని మండిపడ్డారు.
Read also: Maruti Suzuki : జనవరి నుంచి భారీగా పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఇప్పుడే కొనేయండి?
ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా తీర్చీద్దబడుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విదేశీ శక్తులు కుట్రపూరితంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, రాజకీయంగా అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. విదేశీ శక్తులు ఫెక్ వార్తలతో, నిరాధార ఆరోపణలతో భారత దేశాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. OCCRP అనే ఏజెన్సీ భారత దేశంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. విదేశీ కుట్రలో కాంగ్రెస్ పావుగా మారి, అవే అంశాలను లేవెనెత్తడం, సభను జరక్కుండా చేస్తున్నారని మండిపడ్డారు.
మూడేళ్లుగా కార్యక్రమాలను జరక్కుండా అడ్డుకుంటూ ప్రజా ధనాన్ని కాంగ్రెస్ వృధా చేస్తోందని ఆరోపించారు. OCCRP వార్త రాయడం, వెంటనే కాంగ్రెస్ అందుకోవడం కామన్ అయిపోయిందన్నారు. భారత్ లో అగ్రశేణి పారిశ్రామిక వేత్తలను లక్ష్యం చేసుకుని.. పెట్టుబడి దారులను దెబ్బతీయడం.. నిరాధార ఆరోపణలతో ఉసిగొలుపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి వ్యతిరేఖంగా వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్, కాంగ్రెస్ లు ఆందోళనలు చేయడం పరిపాటి అయిపోయిందని అన్నారు.
Read also: OPPO Find X8 Price: ‘ఒప్పో ఫైండ్ ఎక్స్8’ సేల్స్ ఆరంభం.. ప్లిప్‌కార్ట్‌లో 7 వేల తగ్గింపు!
నరేంద్ర మోడీని, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. భారత దేశం పట్ల విషం చిమ్ముతున్నారని తెలిపారు. శరీరాలు వేరయినా OCCRP, రాహుల్ ఒకేలా వ్యవహరిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 6 అబద్ధాలు, 66 మోసాలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు.
Read also: Minor Girls Missing: జగిత్యాలలో మైనర్ బాలిక మిస్సింగ్ .. 24 గంటలు అయినా దొరకని ఆచూకీ
ఫేక్ వీడియో సృష్టించి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు.. హైదారాబాద్ లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. రాజ్యసభలో అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందని ప్రచారం చేశారని అన్నారు. కానీ, ఈవీ సీటు వద్ద డబ్బులు దొరికాయని చైర్మన్ స్పష్టం చేశారన్నారు. నోట్ల కట్ట ఎవరిది అనేది విచారణ జరిగితేనే వాస్తవం బయటకు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఈ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Jagtial: ఒకే గదిలో ఐదు తరగతులు.. ఇబ్బందుల్లో విద్యార్థులు