Site icon NTV Telugu

BJP MP Laxman: దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కాలనేది కాంగ్రెస్ అజెండా

Laxman

Laxman

BJP MP Laxman: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కలనేది కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకుంటుంది.. కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారు.. కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

Read Also: Gopichand : ‘విశ్వం’ హార్ట్ టచ్చింగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ రిలీజ్

ఇక, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తేలిపోయింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. హర్యానాలో ఏడు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది అని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పేదల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలను కుల మతాలకు అతీతంగా మోడీ అమలు పరుస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.

Exit mobile version