Site icon NTV Telugu

MLA Rajasingh: అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి

Rajasingh

Rajasingh

MLA Rajasingh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందన్నారు. ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయి.. ఓల్డ్ సిటీలో తెల్లవారు జామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు.. దుకాణాలను బంద్ చేసేందుకే పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు.. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారు.. ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి.. మర్డర్లు జరిగేది కూడా వాళ్ల కులస్తులవే కదా.. దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు

ఇక, అందులో నీకు బాధ ఏంటి అసద్ అని రాజాసింగ్ ప్రశ్నించారు. చచ్చేది మీ వాళ్లే కదా.. పోలీసులపై ఒత్తిడి ఎందుక తెస్తున్నట్లు? అంటూ మండిపడ్డారు. వారి ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు.. బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలా పత్తర్, కాచిగూడ, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోంది.. మేడ్చల్ లో తెల్లవారు జామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారు.. పోలీసులు అంటే భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీ చేయొచ్చని ఇంకా చెలరేగిపోతున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటివి జరగొద్దంటే ముఖ్యమంత్రి భయపడొద్దు.. పోలీసులు మీ ఆదేశాలు ఫాలో చేయాలి.. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలు కాదు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

Exit mobile version