Site icon NTV Telugu

MLA Raja Singh: బెదిరింపు కాల్ మేయర్కి వస్తే అరెస్ట్ చేస్తారు.. నాకు వస్తే పట్టించుకోరా..?

Raja Singh

Raja Singh

MLA Raja Singh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి రాసిన లేఖలో ఇలా రాసుకొచ్చారు.. బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు.

Read Also: Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తులకు షాక్.. వ్రతం టికెట్ ధరలు భారీగా పెంపు..

అయితే, పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఎవరన్నా ఫోన్ చేస్తే బెదిరిస్తే ఆయనకి అరెస్టు చేస్తారు.. మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ వ్యక్తికి అరెస్టు చేయరా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇలా చేయడం దేని సంకేతం.. అంటే, నేను బిజెపిలో ఉన్నందు కేనా ఈ చిన్నచూపు చూస్తున్నారు పోలీసు అధికారులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోటి రూపాయలు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టారు కదా.. అది టైం పాస్ గురించి కట్టారా అని మండిపడ్డారు.

Exit mobile version