NTV Telugu Site icon

Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది..

Payal Shankar

Payal Shankar

Payal Shankar: ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని బీజేపీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఎన్నో ఏండ్ల కల ఎస్సీ వర్గీకరణ నేడు సహాకరమైంది.. సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించిందన్నారు. నాడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.. నేడు కూడా వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.. వర్గీకరణ కోసం నాడు మందకృష్ణ చేసిన ఉద్యమానికి ఎన్నో అవహేళనలు, అవరోధాలు ఎదురయ్యాయి.. ఆయన పోరాటానికి నేడు ప్రతిఫలం దక్కింది.. బీజేపీ చొరవ వల్లే సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యింది అని వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3లుగా కాకుండా A, B, C లుగా ఉండాలని ఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.. ప్రభుత్వం కూడా ఆవైపుగా దృష్టి పెట్టాలని పాయల్ శంకర్ కోరారు.

Read Also: AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..

ఇక, గ్రూప్ 1, 2, 3ల వల్ల ఎస్సీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అసంతృప్తితో ఉన్న ఆయా వర్గాలని పిలిచి చర్చలు చేయాలని కోరుతున్నాను.. వర్గీకరణ వల్ల ఎస్సీ సామాజిక వర్గాల బ్రతుకుల్లో సంపూర్ణ మార్పులు రావాలి.. అలాగే, సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఉపయోగించుకోకపోతే అధికారులపై చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవాలన్నారు. సబ్ ప్లాన్ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు కావడం లేదు.. వర్గీకరణతో ఎస్సీ వర్గాలకు సామాజిక న్యాయం సమానంగా జరగాలంటే సమూలంగా మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు.. ఎస్సీల కల సాహాకారం కావడంలో మోడీ ప్రధాన పాత్ర పోషించారు.. రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు.. సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణపై ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పాయల్ శంకర్ వెల్లడించారు.