MLA Payal Shankar: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఇక, బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్హత లేదని వెల్లడించారు. బీసీలను అవమానించినందుకే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకపోయింది.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదు అని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేక పోయారు అని పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు.
Read Also: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
ఈ విషయాలన్నీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకుంటే బాగుంటది అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమేనన్నారు. నామినేట్ పదవులు ఈ రాష్ట్రంలో బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమందికి మీరు బీసీలకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే, పార్లమెంట్లో ఎందరి మందికి టికెట్లు ఇచ్చారు తెలుసుకోండి ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర రావు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి విమర్శలు సరికాదు.. ముందు మీ ఇల్లు సక్క పెట్టుకోండి తర్వాత ఇతర పార్టీల గురించి విమర్శించండి అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చుకునే సంప్రదాయం ఉన్న పార్టీ.. ముందు బీసీని సీఎం చేయండి.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి అని పాయల్ శంకర్ విమర్శించారు.
