Site icon NTV Telugu

K. Laxman: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉంది

Klaxman

Klaxman

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అజెండా మజ్లిస్‌ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్‌ను గెలిపించే ప్రయత్నం జరుగుతుంది. చొరబాటుదారులు, రోహింగ్యలు పెత్తనం చలాయిస్తున్నారు. ఈ ఎన్నికను బీజేపీ కార్యకర్తలు సవాల్‌గా తీసుకోవాలి.’’ అని కోరారు.

ఇది కూడా చదవండి: Harish Rao: రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్

‘‘తెలంగాణలో ఒక్క ఏడాదిలో 5 వందల హత్యలు జరిగాయి. పోలీసులకే రక్షణ లేదు. గన్ కల్చర్ పెరిగిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ఇక బీఆర్ఎస్‌ది గత చరిత్రనే.. మళ్లీ గెలిచేది లేదు. కాంగ్రెస్ మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన మీద పట్టు కోల్పోయారు. ఐఏఎస్‌లు బలవంతంగా పదవి విరమణ చేసే పరిస్థితి వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకుని రాహుల్ గాంధీ అభాసు పాలయ్యారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాహుల్ కుటుంబం. మోడీ ఓటు బ్యాంక్‌ను చీల్చే కుట్ర. బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది మోడీ ప్రభుత్వంతోనే.’’ అని లక్ష్మణ్ అన్నారు.

‘‘బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలువబోతుంది. జంగల్ రాజ్‌గా ఉన్నా బీహార్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ విదేశీ కుట్ర దారులతో చేతులు కలిపారు. దేశాన్ని మతాల పేరుతో విడగొట్టి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఓటు చోరీ నినాదం కాంగ్రెస్‌కి బూమరంగ్ అయింది. దొంగ ఓట్లను చేర్పించి దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ అరుస్తుంది. తెలంగాణలో ప్రజలు కాచుకుని చూస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారదర్శకత, జవాబు దారి పాలన తెలంగాణలో కూడా రావాలని చూస్తున్నారు.’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Rohini Kalam: విషాదం.. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌కు బైపోల్ అనివార్యమైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఫలితం మాత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ పోటీ పడుతున్నారు.

Exit mobile version