Sirisha Murder Case: మలక్ పేటలో శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్ లో ఆమె అసలు రంగు బయటపడింది. నన్ను తట్టుకుని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి, లేదా సచ్చిపోవాలి అంటూ సవాల్.. నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా అని పోస్టులో సరిత పేర్కొనింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక, శిరీషను చంపేందుకు పలుమార్లు సరిత స్కెచ్ వేసినట్లు తేలింది. ఆమె గురించి తెలిసే భర్త దూరం పెట్టాడు.. అమెరికా నుంచి సరితను బలవంతంగా ఇండియాకు పంపించాడు. ఆరు నెలల క్రితం ఇండియాకు వచ్చిన సరిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు శిరీషను కిరాతకంగా చంపేసింది సరిత.
Read Also: Jagga Reddy: నేను ఎమ్మెల్సీ అడగడం లేదు.. అడగొద్దు కూడా..
అయితే, శిరీష మర్డర్ కేస్ లో హాస్పిటల్ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నించారు. ఐసీయూ పేషంట్ లకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్లను హాస్పిటల్ నుంచి సరిత తీసుకెళ్లినట్లు మీకు తెలుసా అని క్వశ్చన్ చేయగా.. తమకు తెలీకుండానే తీసుకెళ్ళి ఉండవచ్చు అని పోలీసులకు హాస్పటల్ వర్గాలు స్టెట్మెంట్ ఇచ్చారు. కాగా, వివేరా హాస్పటల్లో మేనేజర్ గా సరిత పని చేస్తున్నారు. శిరీషకు మత్తు ఇంజెక్షన్ డోసేజ్ 5 రెట్లు పెంచి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన తర్వాత శిరీషను ఊపిరి ఆడకుండా చేసి దిండుతో చంపేసింది నిందితురాలు సరిత.