NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేస్తామని.. ఇప్పటికే ప్రకటించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం చిట్‌ చిట్‌ నిర్వహించారు. రాహుల్ గాంధీని కలవలేదని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రాకి ధనికా పేద అన్న తేడా లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Read also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోల హతం

అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని అన్నారు. రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని భట్టి క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని, బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ తల్లి ఉండేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని డిప్యూటీ సీఎం అన్నారు.

Read also: AEE Nikesh Kumar: రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. ఏసీబీ కస్టడీకి ఏఈఈ నిఖేష్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో 64 వేల కోట్ల అసలు వడ్డీలు కట్టామని భట్టి విక్రమార్క అన్నారు. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది.. అందుకే ప్రచారంలో వెనుకపడ్డామని తెలిపారు. పదేళ్ల తరువాత హాస్టల్స్ కి ఇచ్చే డైట్ చార్జీలు పెంచామన్నారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామన్నారు. గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
MLC Kavitha: బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది..

Show comments