Mallu Bhatti Vikramarka: గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని..మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంవారు సివిల్స్ సాధించేలా రావుస్ అకాడమీ ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ కి సెలెక్ట్ అయ్యేవారు ఎక్కువగా ఉండేవారన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మూడో ప్లేస్ లో ఉండేవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారని తెలిపారు. మన రాష్ట్రంలో చదివే వాళ్లు ఎక్కువగానే ఉన్న ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసే వారు లేరన్నారు. గతంలో తెలుగు వాళ్లు సివిల్స్ సర్వీసెస్ లో అధికంగా ఉండి దేశంలో విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా ఉండేవారన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మన దగ్గర నుంచి సివిల్ సర్వెంట్స్ అధికంగా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ సాధించాలనే విద్యార్థులను ఎంకరేజ్ చేస్తుందని అన్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి మా ఎనర్జీ శాఖ నుంచి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూకీ వెళ్లే వారికి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మన ప్రాంతం విద్యార్థులు దేశ వ్యాప్తంగా విధానపరమైన నిర్ణయాల్లో కీలకం కావాలన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. అందుకే పోరాటం చేశాం.. పోరాటం నుంచి వచ్చిందే మన రాష్ట్రం అని తెలిపారు. గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని తెలిపారు. మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసాం.. పేపర్ లీక్ వంటివి మా ప్రభుత్వంలో లేవని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేము పని చేస్తున్నామని అన్నారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..