NTV Telugu Site icon

Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్‌ లో భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు. డోర్ లాక్, వలసలు వారి వివరాలను సేకరించాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశించారు. సమగ్ర సర్వే లో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయీ కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలి అని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ఈ పాఠశాలలో ఆహారం మరియు పరిశుభ్రతపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
Elon Musk: భారత ఎన్నికల విధానంపై ఎలాన్ మస్క్ ప్రశంసలు..

Show comments