Bandi Sanjay: పోలీసులను పట్టించుకోరా… సీఎంకు బండి సంజయ్‌ లేఖ..

  • కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరం..
  • సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..
Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పనివేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంవల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు.

Read also: MLC Kavitha: నేడు కవిత కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..

వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరం అన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమని తెలిపారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో తెలిపారు.
Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..