NTV Telugu Site icon

Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్‌ వికటించి వివాహిత మృతి..

Sandhya Dead

Sandhya Dead

Shiva Nursing Home: వైద్యం వికటించి బండి సంధ్య అనే మహిళ మృతి చెందిన ఘటన నాచారం రాఘవేంద్ర నగర్ లోని శివ నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.

మల్లాపూర్ కి చెందిన బండి సంధ్య కి ఇద్దరు పిల్లలు, భర్త ప్రవైట్ ఉద్యోగి. కాగా సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పండంతో ఆసుపత్రి డాక్టర్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపాడు. అయితే అప్పటి నుంచి సంధ్యకు కడుపులో నొప్పి రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం జరగడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సంధ్యను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్కానింగ్‌ చేసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి రాక ముందు వేరే ఆసుపత్రికి వెళ్లారా అని ప్రశ్నించగా సంధ్య అవును ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం శివ నర్సింగ్‌ హోమ్‌ కు వెళ్లి నట్లు తెలిపింది.

Read also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్

దీంతో కిమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలిపారు. సంధ్య బతకడం చాలా కష్టమని తెలిపారు. అయితే అయినా వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యం చేసిన కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ కారణంగా సంధ్య మృతి చెందింది. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ సరిగా చేయలేదని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వలనే సంధ్య మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. డాక్టర్స్ పై తగు చర్యలు తీసుకోవాలి అని బంధువుల డిమాండ్, హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు మృత దేహాన్ని కదిలించేది లేదని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫ్యామిలీ ప్లానింగ్‌ కు వస్తే పరలోకానికి పంపారని కుటుంబ సభ్యులు రోదించారు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!