NTV Telugu Site icon

Asha Workers: నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు..

Asha Workers

Asha Workers

Asha Workers: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆశా వర్కర్లు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అలాగే, ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ కార్యక్రమం యొక్క డిమాండ్స్ ను తెలియజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 వేల రూపాయల ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. అలాగే, 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని.. రూ. 50 వేలు మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటిని తక్షణమే అమలు చేయకపోతే.. ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కోటీలోని ఆరోగ్య శాఖ కమీషనర్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు.

Read Also: David Warner: ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటకు.. వేదికపై డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్(వీడియో)

ఇక, ఆశా వర్కర్ల యూనియన్ చలో హైదరాబాద్ కి పిలుపునివ్వడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారు జాము నుంచే ఎవరు బయటకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే పోలీసులు ఎలాంటి నిరసనలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు.