NTV Telugu Site icon

ASHA Workers Protest: హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

Asha

Asha

ASHA Workers Protest: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు. ఇక, భారీ పోలీస్ బందోబస్తుతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. అయితే, కొంత మంది ఆశా వర్కర్లు అక్కడ నెలకున్న గందరగోళ పరిస్థితితో సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, ఆశా వర్కర్లన అరెస్టులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది.

Read Also: My Doctor-David Warner: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం!

అయితే, ప్రస్తుతం ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ వేతనాన్ని ఇస్తుంది. దీంతో తమకు వేతనాన్ని కనీసం రూ.18,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఆర్థిక భరోసా కింద రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇక, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.50 వేల సహాయం, విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం రూ.50 అందించాలని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలంటూ ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు.