NTV Telugu Site icon

Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. అందుబాటులో ప్రత్యేక బస్సులు..

Golkonda Bonalu Telangana

Golkonda Bonalu Telangana

Golconda Bonalu: తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జంటనగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-13 డిప్యూటీ కమిషనర్‌ శశిరేఖ, ఈఈ వెంకట శేషయ్య, డిప్యూటీ ఈఈలు రామకృష్ణ, జమీల్‌లను గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్‌ కాంత అరవింద్‌ మహేశ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Read also: Hathras Case: హత్రాస్ ఘటనలో ‘భోలే బాబా’ అరెస్ట్ అవుతారా..? ఐజీ సమాధానం ఇదే..!

శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని పనులు పూర్తి చేయాలని చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం సాయంత్రం నుంచి లంగర్‌హౌస్‌ చౌరస్తా దగ్గర వేదిక ఏర్పాటు పనులు ప్రారంభిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటశేషయ్య లంగర్‌హౌస్‌ను సందర్శించి రోడ్డు గుంతల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. మరోవైపు గోల్కొండ జగదాంబిక బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే, సీబీఎస్‌, పటాన్‌చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి నుంచి 75 బస్సులు తిరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని.. ఎంజీబీఎస్ – 90004 06069, మెహిదీపట్నం – 99592 26133, గోల్కొమ్ డా – 99592 26031 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Rishi Sunak: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా..