Arikepuri Gandhi Arrest : అరికెపూడి గాంధీ అరెస్ట్.. కేసు నమోదు చేసిన పోలీసులు..
- కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం..
- పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arikepuri Gandhi Arrest : కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాంధీతోపాటు నలుగురు కార్పొరేటర్లను అదుపులో తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. గాంధీని తీసుకువెళుతున్న పోలీసులను గాంధీ అనుచరులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తా అని రాలేదు కాబట్టే.. నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చా అన్నారు. దమ్ముంది కాబట్టే కౌశిక్ ఇంటికి వచ్చా అన్నారు. నీ ఇంటికి వచ్చా చూసుకుందా రా కౌశిక్ రెడ్డి అన్నారు గాంధీ. ఉద్రిక్తల మధ్య గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గాంధీని, ఇరువర్గాల కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు.
Read also: Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇంటి ముందు కూర్చున్న గాంధీ..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎక్కడ చూసినా పగిలిన కోడిగుడ్లు, టమాటాలు దర్శనమిచ్చాయి. అయితే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని.. నేను ఇక్కడే ఉంటా అంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులో తీసుకున్నారు.
https://www.youtube.com/watch?v=Z0jcAMcyQRE
Kamareddy: బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!