AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP, Telangana Holiday Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీలో భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. తెలంగాణలో గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాల పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు..
తీవ్ర వాయుగుండం ప్రభావం
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రకు ఈ రోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటేందుకు ప్రయత్నించవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 8 ఎస్డీఆర్ఎఫ్, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
బుడమేరు ఉధృతితో గుడివాడలో ఆందోళన
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో బుడమేరు వరద ఉధృతి పెరుగుతోంది. నందివాడ మండలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగాయి. పుట్టగుంట బుడమేరు వంతెనపై సుమారు అడుగు ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క కారణంగా ప్రవాహానికి అంతరాయం ఏర్పడటంతో అధికారులు ప్రొక్లైనర్లతో తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే గుడివాడ–హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?