CM Chandrababu: దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఉన్న వనరులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
దుబాయ్‌లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేవారు.. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ, ఈ సారి దుబాయ్ లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని, సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి, కూటమికి ఘన విజయం అందించారు. మీరు మా పైన చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను అన్నారు చంద్రబాబు.. గల్ఫ్ లో ఉన్న తెలుగు వారు మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది.. నాడు మిమ్మల్ని గ్లోబల్ సిటిజెన్స్ గా ఉండాలని కోరుకున్నా.. మీరు గ్లోబల్ లీడర్స్ గా మారుతున్నారు అంటే, సంతోషంగా ఉందన్నారు.. గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించిన విషయం విదితమే..
