తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్ జిల్లా హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌ఐఎస్‌ఏ)కి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
Also Read: Jobs Scam Case : తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు
ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, కేరళ వెళ్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్‌షా సమావేశమయ్యే అవకాశం ఉంది.
Also Read: Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో అమిత్ షా తెలంగాణ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తులు, వరుస అరెస్టులతో రాజకీయంగా వేడి పెరిగింది. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ అగ్రనాయతక్వం టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులు కూడా అధికార బీఆర్ఎస్ పై మాటల దాడి పెంచింది. తరచూ అగ్ర నాయకులు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలు, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై అమిత్ షా.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. రాజకీయ పరిస్థితులపై చర్చించి, ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాలను సమీక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.