Site icon NTV Telugu

Verity Pooja: వీసీ మససు మార్చు తల్లీ.. అంటూ అమ్మవారికి స్టూడెంట్స్ పూజలు

Ou

Ou

Verity Pooja: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తూ వినూత్నరీతిలో తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ రాక్షస వైస్ ఛాన్సలర్ ని సంహరించాలని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అమ్మ నువ్వైనా తమను న్యాయం చేయాలని వేడుకున్నారు.

Read Also: Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన

పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పలుమార్లు వైస్ ఛాన్సలర్ కు విన్నవించినా మొండి వైఖరిని వైస్ ఛాన్సలర్ ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ మనస్సు మార్చి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని వేడుకున్నారు. సానుకూల నిర్ణయం తీసుకోలేని సందర్భంలో రాక్షస వీసీని సంహరించాలని ఎల్లమ్మ తల్లిని దేవాలయంలో విద్యార్థులు కోరారు.

Read Also: Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్

Exit mobile version