Site icon NTV Telugu

Air India Place Crash: విమాన ప్రమాదం జరిగింది అందుకే.. తెలంగాణ ఏవియేషన్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

Sn Reddy

Sn Reddy

Air India Place Crash: తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగింది అన్నారు. విమానానికి ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చాం.. ఒక ఇంజిన్ లో ఎర్రర్ వస్తే మరో ఇంజన్ తో విమానం నడుస్తుంది.. కానీ, ఈ సంఘటన లో రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం నెలకొంది.. రెండు ఇంజన్లకు ఇంధనం అందకపోవడం వల్ల ఒక్కసారిగా ఇంజన్లు ఆగిపోయాయి.. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయింది.. ఇంధనం కూడా అందలేదు.. విమాన ప్రమాదాలు మూడు రకాలుగా చూస్తాం.. పక్షులు ఢీ కొట్టినా.. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. టెక్నికల్ ఎర్రర్ వచ్చినా.. ప్రమాదాలు జరుగుతాయని ఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Israel-Iran War: సంయమనం పాటించండి.. ఇరు దేశాలకు భారత్ సందేశం

అయితే, దేశంలో ఇప్పటి వరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ ఏవియేషన్ సీఈవో తెలిపారు. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కెప్టెన్, ఫైలెట్ ఏం అలర్ట్ ఇచ్చారు అనేది తెలుస్తుంది.. కెప్టెన్ మే డే అని ఏటీసీకి అలెర్ట్ అందజేశాడు.. రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ఏటీసీ కూడా ఏమీ చేయలేదు.. ATC కేవలం సిగ్నల్ వ్యవస్థతో పాటు అబ్జర్వేషన్ మాత్రమే చేయగలదు.. 787 డ్రీం లైనర్ విమానం అత్యంత పటిష్టమైనది.. టెక్నికల్ సమస్యలు తక్కువగా వస్తాయి.. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రం 787 డ్రీమ్ లైనర్ కూడా ఫెయిల్ అయింది.. గతంలో నేను కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎన్నో ప్రమాదాల నుంచి చాకచక్యంగా తప్పించాను.. పైలట్ కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక పక్షి అడ్డుగా వచ్చినప్పుడు ఎలా తప్పించాలో నేర్పించాను.. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో ఒక ఇంజన్ లో మంటలు వచ్చాయి.. ఆ సమయంలో కూడా చాకచక్యంగా విమానాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చానని ఎస్ఎన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..

ఇక, గతంలో జరిగిన ప్రమాదాల పైన నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అని తెలంగాణ ఏవియేషన్ సీఈవో ఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. నా దర్యాప్తులో చాలా వరకు సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు జరిగినట్లు ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చాను.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది.. బ్లాక్ బాక్స్ లో కేవలం పైలట్, కో పైలట్ మాత్రమే వాయిస్ రికార్డు అవుతాయి తప్ప.. ప్రయాణికుల వాయిస్ లు రికార్డ్ అవ్వవు.. పైలెట్, కో పైలట్ ప్రయాణికులకు ఏదైనా అలర్ట్ చేసిన సూచనలు చేసిన అవి రికార్డు అయ్యే ఛాన్స్ ఉంటుంది.. బ్లాక్ బాక్స్ అనేది మంటల్లో కాలిపోకుండా ఉండేవిధంగా దాన్ని రూపొందిస్తారు.. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు చూస్తే టేకాఫ్ అయ్యే సమయంలో మాత్రమే ఎక్కువగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది.. ఈ ప్రమాదం లో బ్లాక్ బాక్స్ కీలకం కాబోతుంది.. రెండు రోజులు విచారణ తరువాత అసలు ప్రమాదానికి కారణాలు తెలుస్తాయని ఎస్ఎన్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version