Site icon NTV Telugu

Asaduddin Owaisi: అఖిలపక్ష భేటీ.. ఆపరేషన్ సిందూర్‌పై ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ఇతర విపక్ష నేతలు హాజరయ్యారు.. గంటన్నరపాటు సాగిన అఖిలపక్ష భేటీలో.. ఆపరేషన్ సిందూర్‌, సరిహద్దు భద్రతా వివరాలను వెల్లడించారు రాజ్‌నాథ్‌.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న మన సాయుధ దళాలను మరియు ప్రభుత్వాన్ని నేను అభినందించాను. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నేను సూచించాను అన్నారు.. TRFని ఉగ్రవాద సంస్థగా పేర్కొనమని భారత ప్రభుత్వం.. యూఎస్‌ఏని కోరాలని కూడా నేను సూచించాను. FATFలో పాకిస్తాన్‌ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు..

Read Also: All-Party Meet: 100 మంది ఉగ్రవాదులు హతం.. ఆల్ పార్టీ మీట్‌లో రాజ్‌నాథ్ సింగ్..

కాశ్మీర్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కోవడానికి.. మరోవైపు కాశ్మీరీలను దత్తత తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఒక సువర్ణావకాశం ఉంది అన్నారు ఒవైసీ.. పూంచ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఉగ్రవాద బాధితులుగా ప్రకటించాలన్న ఆయన.. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా వారు ప్రతిదీ కోల్పోయినందున ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించి ఇళ్లు ఇవ్వాలని కోరారు.. ఆపరేషన్ సిందూర్ లో భవల్పూర్ మరియు మురిడ్కే – రెండు ప్రసిద్ధ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.. నాకు తెలిసిన ఇది అతిపెద్ద విజయంగా పేర్కొన్నారు.. ఇక, అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు బటిండాలో రాఫెల్ కూలిపోయిందని నివేదించాయి.. భారత వైమానిక దళం దానిని తిరస్కరించాలి.. ఎందుకంటే ఇది మన సాయుధ దళాల నైతికతను దెబ్బతీయకూడదని అభిప్రాయపడ్డారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ…

Exit mobile version