ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న మన సాయుధ దళాలను మరియు ప్రభుత్వాన్ని నేను అభినందించాను. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నేను సూచించాను అన్నారు.. TRFని ఉగ్రవాద సంస్థగా పేర్కొనమని భారత ప్రభుత్వం.. యూఎస్‌ఏని కోరాలని కూడా నేను సూచించాను. FATFలో పాకిస్తాన్‌ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు..