NTV Telugu Site icon

Addanki Dayakar: పగటి కలలు కంటున్నారు.. కేసీఆర్ పై అద్దంకి కీలక వ్యాఖ్యలు

Addanki Dayakar

Addanki Dayakar

Addanki Dayakar: ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సెటైర్ వేశారు.
కేసీఆర్ పగటి కలలు కంటున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని.. భరించే పరిస్థితిలో ప్రజలు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చడానికేనా ప్రభుత్వం అంటున్నావు… మీరు కూల్చిన వ్యవస్థలను మేము నిర్మిస్తున్నామన్నారు. మీ అవినీతి క్షేత్రాలు కూల్చడమే పనిగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. బురదలో.. మట్టిలో.. చెరువులో మీరు చేసినంత అవినీతి ఎవరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఎక్కడ ఉన్నాడో ఆయనకైన అర్దం అవుతుందా..? అని ప్రశ్నించారు. ప్రజలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ సర్కారు వస్తదని భ్రమ పడుతున్నారని సంచల వ్యాఖ్యలు చేశారు. బయట మీ అల్లుడు.. కొడుకు చేస్తున్న విధ్వంసం చూడండి అని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కూల్చడానికి కాదు నిర్మాంచడానికి అని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కూల్చివేసిన వ్యవస్థలను పునరుద్ధరించడమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. మూసీ శుభ్రం చేసేందుకు అక్కడి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపుతుందని అద్దంకి దయాకర్ అన్నారు.
Applying Ghee: వావ్‌.. అక్కడ నెయ్యి పూసి మసాజ్ చేస్తే సూపర్‌ రిజల్ట్..

Show comments