Site icon NTV Telugu

KTR: రేపటిలోగా కేటీఆర్ సెల్ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని ఏసీబీ ఆదేశాలు..

Ktr

Ktr

KTR: ఫార్ములా ఈ- కార్‌ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలని కేటీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ వాడిన సెల్ ఫోన్, మ్యాక్ బుక్, ట్యాబ్ లో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉంటారని ఏసీబీ యోచిస్తుంది. అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు రెడీ చేస్తున్నారు. దీంతో ఏసీబీ ఆదేశాలపై కేటీఆర్ న్యాయసలహా ప్రకారం నడుచుకుంటాను అని తేల్చి చెప్పారు.

Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..

అయితే, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ కేసులో శనివారం నాడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సుమారు 7 గంటల పాటు విచారణ చేసిన ఏసీబీ.. అవసరం అయితే, మరోసారి పిలుస్తామని తెలిపింది. అలాగే, గతంలో ఉపయోగించిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తీసుకు వచ్చి హ్యాండోవర్ చేయాలని ఏసీబీ తెలిపినట్లు సమాచారం.

Exit mobile version