NTV Telugu Site icon

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం..? తెగ హడావిడి చేస్తున్నారు..

Adi Srinivas

Adi Srinivas

Aadi Srinivas: బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీసీలతో అసలు కవితకు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. బీసీలపైన ముసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందన్నారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముంది..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు.

Read also: Formula E Car Rase Case: వాటితో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..

కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీ ల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ మాకు పట్టలేదన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ ల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా..? అని ప్రశ్నించారు. దేశానికి కులగణన లో తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే  ధ్యేయంగా  కులగణన జరిగిందన్నారు. రాహుల్ గాంధీ సూచనలతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని గుర్తు చేశారు.

Read also: Tammareddy : సీనియర్లు మాటలు వినే పరిస్థితి లేదు.. కుర్ర హీరోలకు కోటరీలు ఉంటున్నాయి

గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. పదేళ్లలో బీసీలను ఏనాడు పట్టించుకోలేదు.. ఏ కార్యక్రమాన్ని సరిగా అమలు చేయలేదన్నారు. బీసీ కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు. బీసీకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు. బీసీలపైన బీఆర్ఎస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే కులగణనను ఎందుకు ఆహ్వానించలేదు..? అని ప్రశ్నించారు. కులగణన పైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు…? అన్నారు. సామాజిక, ఉపాధి, విద్యా,రాజకీయంగా బీసీ వాటా కులగణనతో తేలిపోతుంది..దానికి అనుగుణంగా వాటా దక్కుతుందన్నారు.

Read also:Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేసిన ఏసీబీ..

రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నట్లు కవిత ఆరోపణల్లో అర్థం లేదన్నారు. గందరగోళాన్ని సృష్టించడం కోసం ఆమె డ్రామాలు ఆడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 3వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత అంటున్నారు.. సభ నిర్వహించడానికి నువ్వెవరు…? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత నాయకత్వంలో జరిగే సభకు బీసీలు ఎవరూ హాజరు కావొద్దని అన్నారు. అగ్రకులాల చెప్పుచేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదన్నారు. లిక్కర్ కేసును జనం దృష్టి మళ్లించడానికి కవిత బీసీ డ్రామాలు ఆడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ దందాలో ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన కవిత.. నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ లకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచేది కూడా మా ముఖ్యమంత్రే అని ఆది శ్రీనివాస్ అన్నారు.
Telangana Police: అలా చేస్తే సీజ్‌, లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక..

Show comments