NTV Telugu Site icon

Drugs Case: నార్సింగ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. స్టూడెంట్ వీసాతో ఎంట్రీ.. ఆఫ్రికా నుంచి డ్రగ్స్..

Narsing Drugs Case

Narsing Drugs Case

Drugs Case: నార్సింగ్ డ్రగ్స్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. వీళ్ళ నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు. 13 మందికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. నార్సింగ్ డ్రగ్ కేసులో నిందితులను A1 గా అనౌహా బ్లెస్సింగ్, A2 గా అజీజ్ నోహిమ్ ,A3 గా అల్లం సత్య నారాయణ, A4 సనబోయిన వరుణ్ , A5 గా మహబూబ్ షరీఫ్, A6 గా రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ లపై Ndpc Act 27 కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇండియాలో విక్రయిస్తున్న నెట్వర్క్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఛేదించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read also: Raj Tarun: ఎక్కడున్నా మా ముందుకు రావాల్సిందే.. రాజ్ తరుణ్ కు పోలీసుల నోటీసు

నైజీరియా కి చెందిన అనౌహా బ్లెస్సింగ్ ఇప్పటికే 20 సార్లు ఇండియా వచ్చి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు. నార్సింగ్ లోని ఓ ఫ్లాట్ లో అనౌహా ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.అనౌహా తోపాటు మరో నలుగురిని అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి డ్రగ్ పెడ్లర్ డెవిన్ ఎబుకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఎబుకా స్టూడెంట్ వీసా పై హైదారాబాద్ వచ్చాడు. చదువు పేరుతో టోలిచౌకీ లో ఉంటూ ఎబుకా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో ఫేక్ డీడీ సమర్పించడంతో అప్పట్లోనే ఎబుకా పై కేసు నమోదు చేశారు.

Read also: Russia- Ukraine War: యుద్ధాన్ని ఆపమని పుతిన్కు చెప్పండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

అయినా అవన్నీ పట్టించుకోని ఎబుకా డ్రగ్ సరఫరాలో ఆరితేరిపోయాడు. ఢిల్లీ, బెంగుళూరు, గోవా లకు మకాం మారుస్తూ… డ్రగ్స్ సిండికేట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్స్ సిండికేట్ లో అనౌహా ను నియమించుకున్నాడు. 2018 లో భారత్ కి వచ్చిన అనౌహా.. బెంగుళూరు లో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తూ.. నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. బెంగుళూరు కేంద్రంగా పలు రాష్ట్రాలకు అనౌహా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. హైదారాబాద్ లంగర్ హౌజ్ లో ఉండే అజీజ్ నోహీం, ఎజ్నోహి ఫ్రాంక్లిన్ కు అనౌహా డ్రగ్స్ చేరవేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. వీరి కార్యకలాపాలపై యాంటీ నార్కోటిక్ బ్యూరో దృష్టి పెట్టింది. అనౌహా హైదారాబాద్ రావడాన్ని గుర్తించిన పోలీసులు… అనౌహా ను ఫాలో చేస్తూ.. హైదర్‌షాకోట్ లోని అపార్ట్‌మెంట్ లో రైడ్ చేశారు. అనౌహా తోపాటు ఐదుగురు లోకల్ పెడ్లర్లు పట్టుబడ్డారు. లోకల్ పెడ్లర్లుగా ఉన్న అబ్సైజ్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న విశాఖపట్నంకి చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకి చెందిన కారు డ్రైవర్ శానబోయిన వరుణ్ కుమార్, రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ కు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ గా గుర్తించారు.

Read also: Mahesh Babu Birthday: మొత్తానికి మహేష్ బర్త్డే ట్రీట్ రెడీ చేశారు..

Anivara Asthanam: శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు