NTV Telugu Site icon

CM Revanth Reddy: 21 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి..

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం.. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు.. ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని తెలిపారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత.. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి.. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుంది.. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలానే విధంగా చేస్తున్నారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also: Patnam Narender Reddy: నా పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్‌ రిపోర్ట్‌ తప్పు..

ఇక, జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి.. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.. ఇక, 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది.. ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది.. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Show comments