Jobs Notification: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష, మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరం అని పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల చిత్ర లేఖనం చూశాం వారి నైపుణ్యం అమెరికా, మలేషియాలో కూడా కనిపిస్తుందన్నారు. ఓ పక్కన గత డిసెంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
Read Also: Silk Smitha : సౌత్ క్వీన్ సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్..
కాగా, మన సంస్కృతి, సాంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో విశ్వ విద్యాలయం స్థాపించబడిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేయాలని కోరారు.. ప్రతి నెల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది.. ఈ నెలలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇతర కార్పొరేషన్ రంగాల్లో కాంపిట్యూటివ్ పరీక్షలు నిర్వించి ఖాళీలు భర్తీ చేస్తున్నాం.. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని మా ప్రభుత్వం ఆరాట పడుతుంది. రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం.. మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. 100 కంప్యూటర్లు అతి త్వరలో కేటాయిస్తాం.. ఆర్టి ఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలి.. విశ్వవిద్యాలయం అభివృద్ధికి కోటి రూపాయలు చెక్కును అందించిన పద్మ భూషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఐటీమంత్రి శ్రీధర్ బాబు.