NTV Telugu Site icon

CM KCR : రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్‌లా పని చేశాం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి

Kcr

Kcr

యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి సోమ‌వారం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు జ‌గ‌దీష్ రెడ్డి, హ‌రీష్‌రావు, భువ‌నగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విస్ గొంగిడి సునిత, జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి స‌హా జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఒక టాస్క్‌ కోసం పుట్టిన పార్టీ అని, అవమానాలు, అవహేళనలు ఎదర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్‌లా పని చేశామని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు సీఎం కేసీఆర్. కరెంట్‌ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని, అందుకే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నామన్నారు.

Also Read : Uttar Pradesh: నేలకూలిన విమాన ఇంధన ట్యాంక్‌లు.. ఆ లోపం వల్లే..!

అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్‌ ఆఫీసర్లతో మాట్లాడానన్న సీఎం కేసీఆర్‌.. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఎలా ఇస్తామని అడిగానన్నారు. కరెంట్‌ అధికారుల సూచనలతో సబ్‌స్టేషన్లలో మార్పులు చేశామని, అత్యవసరంగా వాడుకునేందుకు కరెంట్‌ కొనాల్సి ఉంటుందని అధికారులు చెప్పారన్నారు. ఎంత ఖర్చైనా సరే కరెంట్‌ కొనాలని చెప్పాను. తలసరి ఆదాయంలో ఇండియాలోనే నెంబర్‌వన్‌ అని ఆయన అన్నారు. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయిందని, రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపురాశులే కన్పిస్తున్నాయని, రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ వరి ధాన్యంతో నిండిపోయాయన్నారు.

Also Read : Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం