Site icon NTV Telugu

Hyderabad Thief: తస్మాత్ జాగ్రత్త.. మీ తాళంతోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు!

Pa

Pa

మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్

ఇంటికి తాళం వేసి షూ స్టాండ్‌లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు.. జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ కిలాడీ లేడీ కూడా అదే కేటగిరీ. జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆ దొంగతనం చేసింది ఓ యువతి. ఆమె పేరు ఆరోహి అలియాస్ బేబీ. స్వస్థలం ఉత్తర ప్రదేశ్. కానీ హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చింది.

Also Read:Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!

ఆల్విన్​కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్​జాబ్​ చేస్తుంటాడు. ఈ నెల18న పిల్లలను స్కూల్లో దిగబెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి… తాళం చెవిని చెప్పుల స్టాండ్‌లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి తిరిగి వచ్చి చూస్తే తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయమైంది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు జల్లెడ పడ్డారు. దీంతో ఆరోహి అనే యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. సనత్​నగర్‌లోని మధునగర్‌లో ఉంటున్న ఆరోహి.. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. అలా తిరిగే సమయంలో తాళం వేసిన ఇళ్లు రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత వాళ్లు పెట్టే కీ ద్వారానే చోరీ చేస్తుంది. ఆమెకు లగ్జరీ లైఫ్​అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్ ​సిటీస్​కు వెళ్లి లైఫ్​ను నచ్చినట్టు ఎంజాయ్ ​చేయాలని ఆశ. ఆమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్​ను తాను అనుకున్నట్టు మలుచుకోవడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది.

Exit mobile version