Site icon NTV Telugu

హైదరాబాద్ కు తప్పిన అతి భారీ వర్షం ముప్పు…

గులాబీ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కు అతి భారీ వర్షం ముప్పు తప్పిందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది. జీహెచ్ఎంసి పరిధిలో అక్కడక్కడా తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. అయితే ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. ఈ రాత్రికి ఒక మోస్తరు వర్షం… దఫా దఫాలుగా కురిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ గాలుల దిశ మారి తెలంగాణ మీదుగా పయనిస్తే ఈ అర్ధరాత్రి హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version