Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

Vattinagulapally Gambling Raid

Vattinagulapally Gambling Raid

Gambling Raid: పేకాట క్లబ్బులను ప్రభుత్వం మూసివేయడంతో ఇప్పుడు ఫామ్ హౌస్ లు అడ్డాగా పేకాట నడుస్తుంది ..ఎక్కడెక్కడ రీస్టార్ట్ లతోపాటు ఫామ్ హౌస్లలో పేకాట పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు అధికారులకు సమాచారం వస్తుంది. ఏకంగా హైదరాబాద్ నగరంలోని వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి పేకాట ఆడుతున్నట్లు అధికారుల విషయంలో బయటపడింది .దీంతో ప్రముఖ వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో జూదమాడుతున్న 27 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వట్టినాగులపల్లిలోని ‘ది స్కై బై విహారా’ ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు రహస్యంగా ‘అందర్-బహార్’ పేకాట ఆడుతున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌పై మెరుపు దాడి నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతూ పట్టుబడిన 27 మందిని అదుపులోకి తీసుకుని, పందెం కాస్తున్న రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన చిన్న యాదవ్, సన్‌సిటీకి చెందిన సోను, అలాగే నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి గత నాలుగు నెలలుగా ఈ ఫామ్‌హౌస్‌లో పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ స్థావరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల మేర నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల నుంచి జూదరులను రప్పించి పెద్ద ఎత్తున ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై గచ్చిబౌలి పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుల పాత్రతో పాటు, ఫామ్‌హౌస్ యాజమాన్యం ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నారు.