Site icon NTV Telugu

Bethi Subash Reddy: నేను ఈటలకు మద్దతు ఇస్తా.. బీఆర్ఎస్ కు భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై..

Bati Subhash Reddy

Bati Subhash Reddy

Bethi Subash Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ కు గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికై పాటు పడ్డానని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు భేతి సుభాష్‌ రెడ్డి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.

Read also: Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం..

అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని మన తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీ కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి టికెట్‌ ఇచ్చే ముందుకు కూడా తనకు మాట మాత్రమైనా చెప్పలేదని లేఖలో తెలిపారు. మీ మీద విశ్వాసంతో పార్టీ గెలుపుకు కృషి చేశానని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో అయినా అవకాశం వస్తుందని ఆశించాను.. కానీ మళ్లీ మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి చర్చ జరపకుండా ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించటం కంటే.. ఉద్యమ సహచరుడు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నానని లేఖలో తెలిపారు. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అని భేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Ponnam Prabhakar: రాముని ఫోటోతో కాదు.. మోడీ ఫోటోతో ఓట్లు అడగండి..

Exit mobile version