Site icon NTV Telugu

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రోడ్లపై వాహనాలను వదిలి వెళ్తున్నారా?

హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా కాలంగా రోడ్లపై వదిలివెళ్లిన వాహనాలను పోలీసులు క్రేన్‌ల సహాయంతో తొలగిస్తున్నారు. ఆయా వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను వదిలివెళ్లే వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 15 రోజులు కారు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.


అంతేకాకుండా రోడ్లపై వాహనాలు వదిలి వెళ్లేవారికి భారీగా జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. రోజుల తరబడి రోడ్లపై కారు వదిలేసి వెళ్లొద్దని సూచించారు. రోడ్లపై వ‌దిలివెళ్లిన వాహ‌నాల‌ను సంబంధిత య‌జ‌మానులు త‌క్షణ‌మే అక్కడ్నుంచి తీసుకెళ్లాల‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ అడిష‌న‌ల్ సీపీ రంగ‌నాథ్ సూచించారు. ఈ డ్రైవ్ నగరంలో కొన్నిరోజుల పాటు సాగుతుందని.. వాహనదారులు సహకరించాలని కోరారు.

https://ntvtelugu.com/84-years-old-man-stuck-in-bank-locker-room/
Exit mobile version