హైదరాబాద్ లో పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. SIB, కౌంటర్ ఇంటలిజెన్స్, టాస్క్ ఫోర్స్ రైడ్స్ నిర్వహించారు. మూసారాంబాగ్ , బాబా నగర్, సైదాబాద్, సంతోష్ నగర్లలో అర్థరాత్రి రైడ్స్ జరిపారు. 15 ఇళ్ళల్లో సోదాలు జరిపి 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రహస్య ప్రదేశంలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే… హైదరాబాద్ కుట్రకేసును భగ్నం చేశారు సిటీ పోలీసులు.
Read Also: Swimming Deaths: యాచారంలో విషాదం…ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు కుట్ర చేశాడు జాహిద్. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకున్నాడు జాహిద్. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం రిక్రూట్మెంట్ చేశాడు జాహిద్. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలు టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నాయని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో సైతం జాహిద్‌ను ప్రశ్నించారు పోలీసులు. దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో వున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
జాహిద్ అరెస్టులో వెలుగులోకి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. దసరా ఉత్సవాలను టార్గెట్ చేసింది జాహిద్ అండ్ టీమ్. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేయాలని భావించింది. హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై కేసు నమోదయింది. జాహిద్‌తోపాటు ఏడుగురిపై కేసు నమోదు చేసింది సిట్. అందులో సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై కేసు నమోదు చేసింది. పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్‌కు నిధులు అందుతున్నాయి. టెర్రర్ దాడుల కోసం పాక్ నుంచి గ్రనేడ్స్ పంపించారు ఉగ్రవాదులు.
జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర పన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలపై దాడులకు ప్లాన్ చేశారు. గతంలో జాహిద్‌ను ప్రశ్నించిన అధికారులు అనేక విషయాలు వెలుగులోకి తెచ్చారు. జాహిద్ పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐలకు చెందిన హ్యాండ్లర్స్‌తో లింక్‌లు వున్నాయి. హైదరాబాద్‌లో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు.
Read Also: US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
