Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
- స్లమ్ నుంచి స్టార్టప్ వరకూ.. హైదరాబాద్ యువకుడి అసాధారణ ప్రయాణం
- విద్యార్థుల కోసం దేశంలోనే తొలి ‘స్టూడెంట్ పేమెంట్స్ యాప్’
- పేరెంట్స్ కంట్రోల్‌తో డెబిట్ కార్డ్.. కెరీర్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఆకర్షణ
- ఫోర్బ్స్ గుర్తింపు.. గ్లోబల్ స్థాయికి దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక సాధారణ యువకుడు దేశ ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపాడు. పార్సీగుట్ట అనే స్లమ్ ఏరియాకు చెందిన శివగణేష్ అనే యువకుడు విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ‘జెన్ ఐఫై’ (Zen I5) అనే సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘స్టూడెంట్స్ పేమెంట్స్ యాప్’ను లాంచ్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టి-హబ్’ (T-Hub) లో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ స్టార్టప్, నేడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన శివగణేష్‌కు వచ్చిన ఆలోచనల నుంచే ఈ సరికొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
వయోపరిమితి లేని డెబిట్ కార్డ్.. పేరెంట్స్ కంట్రోల్
ఈ స్టార్టప్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. విద్యార్థుల కోసం ఎలాంటి వయోపరిమితి (Age Limit) లేని ప్రత్యేక డెబిట్ కార్డును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు, డెబిట్ కార్డుల జారీలో ఉండే నిబంధనలను పక్కన పెట్టి, కేవలం విద్యార్థుల కోసమే దీనిని డిజైన్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని ఈ యాప్‌లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. అంతేకాకుండా, పిల్లలు ఆ డబ్బును ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఖర్చు చేస్తున్నారనే ప్రతి చిన్న విషయాన్ని తల్లిదండ్రులు తమ మొబైల్ ద్వారానే సులభంగా ట్రాక్ చేసేలా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు.
Also Read
- Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
- Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
భరోసానిచ్చే స్టూడెంట్ కెరీర్ ఇన్సూరెన్స్
కేవలం పాకెట్ మనీ మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు జెన్ ఐఫై ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ డెబిట్ కార్డును ఉపయోగించే విద్యార్థులకు ప్రత్యేకంగా ‘కెరీర్ ఇన్సూరెన్స్’ (Career Insurance) సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తూ విద్యార్థి తల్లిదండ్రులకు ఏదైనా ప్రమాదం జరిగి చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే, సదరు విద్యార్థి విద్యాభ్యాసాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించే పూర్తి బాధ్యతను ఈ సంస్థే స్వీకరిస్తుంది. ఇది విద్యార్థుల చదువుకు ఒక బలమైన రక్షణ కవచంలా మారుతుందని చెప్పవచ్చు.
కార్టూన్ సినిమాతో ఆర్థిక అవగాహన
చిన్న వయసు నుంచే పిల్లలకు బ్యాంకింగ్ లావాదేవీలు, పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం బొమ్మలతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని సిద్ధం చేయడంతో పాటు, ‘ఎమర్జెంట్ వెంచర్స్’ సంస్థ అందించిన ₹80 లక్షల నాన్-రిఫండబుల్ గ్రాంట్ నిధులతో ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ ‘డిస్నీ వరల్డ్’ తో చేతులు కలిపి పిల్లల కోసం ఒక ప్రత్యేక ‘ఫైనాన్షియల్ కార్టూన్ ఫిలిం’ను నిర్మిస్తోంది. ఈ యానిమేషన్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు కోటి మంది విద్యార్థులకు ఉచితంగా చూపించి, వారిలో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్బీఐ లైసెన్స్.. గ్లోబల్ లెవెల్ గుర్తింపు
జెన్ ఐఫై సంస్థను పూర్తి స్థాయి బ్యాంక్‌గా మార్చేందుకు శివగణేష్ బలమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం పేమెంట్స్ లైసెన్స్ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కి దరఖాస్తు చేసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్, ఆ తర్వాత 10 ఏళ్లలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ సాధించి, ప్రపంచంలోనే విద్యార్థుల కోసం అంకితమైన పూర్తి స్థాయి బ్యాంక్‌గా ఎదగాలన్నదే అతడి సంకల్పం. కాగా, శివగణేష్ సాధించిన ఈ అసాధారణ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ (Forbes) ఆసియా ఖండంలోని ‘టాప్ 30 యంగ్ ఎంటర్ప్రెన్యూర్ల’ జాబితాలో ఈ హైదరాబాద్ కుర్రాడికి చోటు కల్పించి గౌరవించింది.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?