NTV Telugu Site icon

Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు పోలీస్‌ శాఖ కీలక సూచనలు

Ikea Traffic

Ikea Traffic

వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ఫేజ్ – 1 ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఫేజ్ – 2 ప్రకారం.. ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని, ఫేజ్ – 3 ప్రకారం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలన్నారు.

Also Read : Big Breaking: బాబాయ్ కోసం అబ్బాయ్ .. ‘బ్రో’ కోసం రంగంలోకి చరణ్

ఇదిలా ఉంటే.. నిన్నటి అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిస్సా తీరాల్లోని, పశ్చిమ మధ్య పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం సుమారుగా రాగల 24 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలను చేరుకునే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, గుణ, రాయ్‌పూర్, భవానీపట్న, పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

Also Read : Ramya Krishnan: శివగామి రమ్యకృష్ణ కొడుకును చూశారా.. త్వరలో హీరో అయిపోయేలా ఉన్నాడు

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షములు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షములుతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.