Site icon NTV Telugu

Telangana Traffic: నగరంలో 3 గంటలు ట్రాఫిక్ ఆంక్షలు

Trafic

Trafic

రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్‌ చౌరస్తా, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, చింతల్‌ బస్తీ, లక్డీకపూల్‌, బషీర్‌బాగ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ జంక్షన్‌, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

అయితే.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంతో పాటు వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు పాల్గొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. దిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్గాంధీ బయటకు వచ్చే వరకు శాంతియుతంగా నిరసన తెలపాలని టీపీసీసీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్వర్రెడ్డి, బోసురాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. ముంద‌స్తుగా పోలీసులు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ ఆంక్షలు దారి మళ్లిస్తున్నారు.

Srinivas Goud: దేశ ప్రజలను చైతన్య పర్చడానికే.. కేసీఆర్ వస్తున్నారు

Exit mobile version